శ్రీహరికోట : . 11న .. పీఎస్‌ఎల్‌వీ-సి48 ప్రయోగం.. - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, November 30, 2019

శ్రీహరికోట : . 11న .. పీఎస్‌ఎల్‌వీ-సి48 ప్రయోగం..


ఇస్రో కేంద్రమైన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి వచ్చే నెల 11న పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సి48ను ప్రయోగించనున్నారు. ఇందుకోసం శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. షార్‌లోని మొదటి ప్రయోగ వేదికపై ఈనెల మొదటి వారం నుంచి వాహకనౌకకు సంబంధించిన అనుసంధానం చురుగ్గా సాగుతోంది.


 పీఎస్‌ఎల్‌వీ-సి48 ద్వారా రీశాట్‌-2బీఆర్‌1తోపాటు విదేశాలకు చెందిన ఉపగ్రహాలను నిర్ణీతకక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. వారం క్రితం రీశాట్‌-2బీఆర్‌1 ఉపగ్రహం షార్‌కు చేరుకుంది. దానికి పలు పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు జీఎస్‌ఎల్‌వీ ప్రయోగానికి సంబంధించిన ఎల్‌40 స్టేజీని శ్రీహరికోటకు గురువారం ప్రత్యేక వాహనంలో తీసుకొచ్చారు.


Post Top Ad