జార్ఖండ్‌లో మొదటి దశ పోలింగ్ ప్రారంభం - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, November 30, 2019

జార్ఖండ్‌లో మొదటి దశ పోలింగ్ ప్రారంభం

రాంచీ : జార్ఖండ్‌లో శనివారం మొదటి దశ పోలింగ్ జరగనుంది. 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ పోలింగ్ జరగనుంది. అయితే ఈ మొదటి దశ పోలింగ్‌ సగ భాగం నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు కావడంతో పోలీసులు, అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఇందులో ఓ మంత్రితో పాటు పీసీసీ అధ్యక్షుడు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 

మొదటి దశ పోలింగ్‌లో భాగంగా 37,83,055 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 5 దశల్లో ఈ పోలింగ్ జరగనున్న ఈ పోలింగ్ డిసెంబర్ 20 తో ముగియనుంది. డిసెంబర్ 23 న తుది ఫలితాలు వెలువడనున్నాయి.


Post Top Ad