శంషాబాద్‌లో మరో దారుణం..... - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, November 30, 2019

శంషాబాద్‌లో మరో దారుణం.....


 రంగారెడ్డి: శంషాబాద్ సిద్దులగుట్ట దగ్గర మహిళ మృతి కేసును పోలీసులు వేగవంతం చేశారు. హత్య జరిగిన ప్రదేశంలో క్లూస్ టీమ్స్ కొన్ని ఆధారాలు సేకరించాయి.ఘటన జరిగిన చోటు నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వైపు డాగ్ స్క్వాడ్ వెళ్లింది. దీని ఆధారంగా పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. 
మహిళకు సంబంధించిన వివరాలు తీసుకునే ప్రయత్నాన్ని పోలీసులు చేస్తున్నారు.గుడిలో ఉన్న స్వాములను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. మహిళ మృతదేహానికి ఉస్మానియా ఆసుపత్రిలో వైద్యులు నేడు పోస్టుమార్టం నిర్వహించనున్నారు. మహిళకు సంబంధించిన కాలిపోయిన చీర, గాజులు, చెప్పులు, మరికొన్ని వస్తువులను క్లూస్ టీమ్స్ సేకరించాయి.నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్ పాపిస్తామని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే శంషాబాద్ చుట్టుపక్కల రోడ్డులో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. సిద్ధులగుట్ట వచ్చే రోడ్డులో ఉన్న సీసీ టీవీలను పోలీసులు పరిశీలిస్తున్నారు..

Post Top Ad