జనగామలో హైటెక్ సెక్స్ రాకెట్.. పట్టుబడ్డ ఆరుగురు - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, November 10, 2019

జనగామలో హైటెక్ సెక్స్ రాకెట్.. పట్టుబడ్డ ఆరుగురు

వ్యభిచార ముఠాలు కొత్త దారులు వెతుక్కున్నట్లు కనిపిస్తోంది. చిన్న నగరాలు, పట్టణాలను టార్గెట్ చేసి గుట్టుచప్పుడు కాకుండా హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లాంటి నగరాల్లో పోలీసుల నిఘా పెరగడంతో నయా దారులు ఎంచుకుంటున్నారు. పేద కుటుంబాలకు చెందిన అమ్మాయిలకు మాయమాటలు చెప్పి వ్యభిచార రొంపిలోకి దింపుతున్నారు. ఫ్యామిలీతో అద్దెకు ఉంటామని చెప్పి ఇళ్లను కిరాయికి తీసుకొని సుదూర ప్రాంతాల నుంచి యువతులను రప్పించి వ్యభిచారం చేయిస్తున్నారు. జనగామ పట్టణంలో బయటపడ్డ సెక్స్ రాకెట్ ద్వారా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

జనగామ పట్టణంలో హైటెక్ సెక్స్ రాకెట్ బయటపడింది. కొంత మంది మహిళలు ముఠాగా ఏర్పడి పట్టణంలో హైటెక్ సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన పోలీసులు.. వ్యభిచారం నిర్వహిస్తున్న ఆరుగురు మహిళలు, ఇద్దరు విటులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Post Top Ad