పెళ్లి కూతురు పెళ్లి పీటలపై ఉండగ .. ఆత్మహత్య చేసుకున్న పెళ్లికొడుకు .... - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, November 10, 2019

పెళ్లి కూతురు పెళ్లి పీటలపై ఉండగ .. ఆత్మహత్య చేసుకున్న పెళ్లికొడుకు ....

మరికొద్దిసేపట్లో వివాహం జరుగుతుందనగా. వరుడు ఆత్మహత్య చేసుకోవడంతో కళ్యాణ మండపం రోదనలతో నిండిపోయింది. వరుడు, వధువు కుటుంబ సభ్యులతో పాటు బంధువులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కొంపల్లిలో ఈ విషాదం జరిగింది. హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ కు చెందిన సందీప్ కు, బాలానగర్ కు చెందిన మౌనికకు కొద్దిరోజుల క్రితం పెళ్లి నిశ్చయమైంది. ఆదివారం ఉదయం కొంపల్లిలో వారి వివాహం జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సందీప్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పెళ్లికుమారుడికి కేటాయించిన గదిలో ఉరివేసుకున్నాడు. దీన్ని గమనించిన బంధువులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతడు చనిపోయాడని వైద్యులు తెలిపారు. కుటుంబ పరిస్థితుల కారణంగా మనస్తాపానికి గురై సందీప్ సూసైడ్ చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

Post Top Ad