భాగ్యనగరం లో రెండు దారుల వంతెనల నిర్మాణాల కార్యాచరణ ప్రారంభం - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, November 25, 2019

భాగ్యనగరం లో రెండు దారుల వంతెనల నిర్మాణాల కార్యాచరణ ప్రారంభం


హైదరాబాద్: గ్రేటర్ ప్రజా రవాణా వ్యవస్థలో మరో అద్బుత దృశ్యం ఆవిష్కృతం కానున్నది. సింగిల్ పిల్లర్‌పై మెట్రో రైలు, రోడ్డు రవాణా వాహనాలు రాకపోకలు సాగించనున్నాయి. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా గ్రేటర్‌లో డబుల్ డెక్కర్ ైఫ్లె ఓవర్లపై ప్రభుత్వం దృష్టి సారించింది. పెరుగుతున్న వాహనాలకు తగ్గట్టుగా రహదారులను విస్తరించలేని పరిస్థితుల్లో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ల నిర్మాణం పరిష్కారంగా కనిపిస్తున్నది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ తరహాలో నగరంలో ఈ రెండంతస్తుల వంతెనలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇటీవల పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, హెచ్‌ఎండీఏ కమిషనర్ అరవింద్‌కుమార్, మేయర్ బొంతు రామ్మోహన్, పలు శాఖల అధికారులు నాగ్‌పూర్ పర్యటనలో డబుల్ డెక్కర్ ైఫ్లె ఓవర్ నిర్మాణంపై అధ్యయనం చేశారు. నాగ్‌పూర్‌లో డబుల్ డెక్కర్ ప్రత్యేకతలు నాగ్‌పూర్‌లో 38.21 కిలోమీటర్ల మేర మెట్రో రైలు ప్రాజెక్టును రూ.8,600కోట్ల అంచనా వ్యయంతో చేపట్టారు. దేశంలోనే వినూత్నంగా ఒకే స్తంభానికి డబుల్ డెక్కర్ ైఫ్లె ఓవర్‌ను నిర్మించారు. ఒక దానిపై మరోటి వస్తుంది. మొదటి ైఫ్లె ఓవర్‌లో వాహనాల రాకపోకలకు, రెండో ైఫ్లె ఓవర్‌లో మెట్రో రైలు ప్రయాణించేలా నిర్మించారు.


ఇదే తరహాలో నగరంలో డబుల్ డెక్కర్ నిర్మాణం చేపట్టాలని హెచ్‌ఎండీఏ సన్నాహాలు చేస్తున్నది. తొలి విడుతలో ప్యారడైజ్ టూ కండ్లకోయ ఇందులో భాగంగానే తొలి విడతగా సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి మేడ్చల్ కండ్లకోయ ఔటర్ రింగు రోడ్డు వరకు దాదాపు 18.50 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ ైఫ్లె ఓవర్ నిర్మాణానికిగానూ సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు డిటెల్ట్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) రూపకల్పనకు హెచ్‌ఎండీఏ టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఆసక్తి గల బిడ్డర్ల ప్రతిపాదనలను అధికారులు పరిశీలించనున్నారు.


పాదాచారుల సౌకర్యాలు, స్ట్రీట్ లైట్లు, బస్‌స్టేషన్లు ఎక్కడెక్కడ అవసరం? తదితర సమగ్ర వివరాలను సదరు ఎజెన్సీ డీపీఆర్ రూపంలో హెచ్‌ఎండీఏకు నివేదిక అందించనున్నది. త్వరలో ఈ ప్రాజెక్టు ప్రతిపాదనపై మరింత స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాగా డబుల్ డెక్కర్ ైఫ్లె ఓవర్‌తో బహుళ ప్రయోజనాలు ఉండనున్నాయి. కింద, మధ్యలో రోడ్డు రవాణా, చివరి అంతస్తులో మెట్రో రైలు ఆపరేషన్స్ ఉంటాయి. ప్రధానంగా డబుల్ డెక్కర్ ైఫ్లె ఓవర్‌తో భూమి, ఆస్తుల సేకరణ గణనీయంగా తగ్గనున్నది. ప్రాజెక్టు వ్యయంలో  నలభై  శాతం మేర వ్యయం తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒకే స్తంభంపై మెట్రో, రోడ్డు రవాణాతో సుందర దృశ్యం ఆవిష్కృతం కానున్నది.మహా ఉపశమనం సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి మేడ్చల్ కండ్లకోయ ఔటర్ రింగు రోడ్డు వరకు 18.50 కిలోమీటర్ల మేర స్కై వే నిర్మాణానికి హెచ్‌ఎండీఏ ఇప్పటికే ప్రతిపాదనలు రూపొందించింది. రేడియల్ రోడ్ నం.12లో భాగంగా 6లేన్ల రహదారి నిర్మాణానికిగానూ రూ.1500కోట్ల మేర వ్యయం అవుతుందని డీపీఆర్‌లో తేల్చారు. పద్దెనిమిది కిలోమీటర్లలో తొమ్మిది కిలోమీటర్లు ఎలివేటెడ్ కారిడార్, మరో 8 కిలోమీటర్ల మేర కింది (రోడ్డు) రహదారి నిర్మాణం, సర్వీస్ రోడ్ ఉండాలని ప్రతిపాదించారు. కానీ ఈ ప్రతిపాదన ఆచరణలోకి రాలేదు. ఇదే ప్రస్తుతం డబుల్ డెక్కర్ నిర్మాణం వైపు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నిర్మాణం పూర్తయితే నగరం నుంచి నిజామాబాద్ వైపు వెళ్లే ప్రయాణికులకు మహా ఉపశమనం లభించనున్నది


Post Top Ad