ఐరాస వేదికగా పాక్‌కు దీటైన కౌంటర్‌ ఇచ్చిన భారత్ - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, November 30, 2019

ఐరాస వేదికగా పాక్‌కు దీటైన కౌంటర్‌ ఇచ్చిన భారత్

 అయోధ్య తీర్పుపై పాకిస్తాన్‌ చేసిన ప్రకటనను భారత్‌ తీవ్రస్దాయిలో ఎండగట్టింది. పాక్‌ ప్రభుత్వం తన మనుగడ కోసం అసత్యాలను ప్రచారంలో పెడుతోందని మండిపడింది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి భేటీలో​ ఐరాసలో భారత ప్రతినిధి విమ్రాష్‌ ఆర్యన్‌ మాట్లాడుతూ మైనారిటీల మానవ హక్కులకు సంబంధించి చర్చించే కీలక వేదికపై పాకిస్తాన్‌ దుష్ర్పచారం సాగిస్తోందని, భారత్‌లో మైనారిటీ హక్కులపై పాక్‌ మొసలి కన్నీరు కారుస్తోందని దుయ్యబట్టారు. 

పొరుగు దేశంలో మైనారిటీల హక్కుల గురించి ఐరాస వేదికను తప్పుదారి పట్టించే బదులు పాకిస్తాన్‌ తన దేశంలో మైనారిటీల అభ్యున్నతికి పాటుపడాలని సూచించారు. తమ దేశంలో మైనారిటీలు, సొంత పౌరులు నిజమైన ప్రజాస్వామ్యాన్ని అనుభవించని క్రమంలో పాకిస్తాన్‌ నుంచి పాఠాలు నేర్చుకునే స్థితిలో ప్రపంచ దేశాలు లేవని ధ్వజమెత్తారు.