పడ్నవీస్ కి చెక్ పెట్టిన ఉద్దావ్ దాక్రే ...సీఎం అభ్యర్థిగా, మహావికాస్‌ అఘాడీ నేతగా ఉద్ధవ్‌ థాకరే ఎన్నిక - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, November 26, 2019

పడ్నవీస్ కి చెక్ పెట్టిన ఉద్దావ్ దాక్రే ...సీఎం అభ్యర్థిగా, మహావికాస్‌ అఘాడీ నేతగా ఉద్ధవ్‌ థాకరే ఎన్నిక


ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిగా శివసేన చీఫ్‌ ఉద్దవ్‌ థాకరే పేరు ఖరారైంది. సీఎం అభ్యర్థిగా, మహావికాస్‌ అఘాడీ నేతగా ఉద్ధవ్‌ థాకరేను ఎన్నుకున్నారు. సీఎం అభ్యర్థిగా ఉద్ధవ్‌ థాకరే పేరును ఎన్సీపీ నేత జయంత్‌ పాటిల్‌ ప్రతిపాదించగా..ఎన్సీపీ ప్రతిపాదనలకు కాంగ్రెస్‌ నేత బాలాసాహెబ్‌ ధోరట్‌ మద్దతు తెలిపారు. మహావికాస్‌ అఘాడీ కూటమి ఏర్పాటుకు 3 పార్టీల సంయుక్త సమావేశంలో ఆమోదం తెలిపారు. మహా వికాస్‌ అఘాడీ కూటమి నేతలు కాసేపట్లో గవర్నర్‌ భగత్‌సింగ్‌ కొష్యారీని కలువనున్నారు. డిసెంబర్‌ 1న ఉద్ధవ్‌ థాకరే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Post Top Ad