తెలంగాణ ప్రభుత్వంతో స్కైవర్త్ కంపెనీ ఒప్పందం - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, November 30, 2019

తెలంగాణ ప్రభుత్వంతో స్కైవర్త్ కంపెనీ ఒప్పందం

 తెలంగాణ పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావుతో స్కైవర్త్ గ్రూప్ చైర్మన్ లై వీడ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం నవంబర్ 29న హైదరాబాద్‌లో భేటీ అయింది. తాజా ఒప్పందం ప్రకారం... స్కెవర్త్ కంపెనీ మొదటి దశలో రూ. 700 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్ కేంద్రంగా 50 ఎకరాల విస్తీర్ణంలో ఉత్పాదక ప్లాంటును ఏర్పాటు చేయనుంది. స్కైవర్త్ పెట్టుబడులతో రాష్ట్రంలో 5 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ వెల్లడించారు.


అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సరికొత్త ఫీచర్లను అందించే స్కైవర్త్ బ్రాండ్... ఎల్‌ఈడీ టీవీలను ఇప్పటికే ఉత్పత్తి చేస్తోంది. కార్యకలాపాల విస్తరణలో భాగంగా ఎలక్ట్రానిక్ వాహనాల్లో ఉపయోగించే లిథియం బ్యాటరీలు, ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లను తయారు చేయాలని స్కైవర్త్ నిర్ణయించింది.

Post Top Ad