దట్టమైన మంచు దుప్పటి కప్పుకున్న కేదార్ నాథ్ శైవ క్షేత్రం - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, November 30, 2019

దట్టమైన మంచు దుప్పటి కప్పుకున్న కేదార్ నాథ్ శైవ క్షేత్రం

చార్ థామ్ లలో ఒకటైన ప్రతిష్టాత్మకమైన శైవ క్షేత్రం కేదార్ నాథ్‌ మంచు దుప్పటి కప్పుకుంది. శీతాకాలం కావడంతో ఆ ప్రాంతంలో మంచు భారీగా కురుస్తోంది. దీంతో ఆలయ పరిసర ప్రాంతాలన్నీ దట్టమైన మంచు దుప్పటి పరుచుకున్నట్లున్నాయి.
శీతాకాలం సమీపించే సమయంలో భక్తులకు అసౌకర్యం కలగకుండా గుడిని తాత్కాలికంగా మూసేస్తారన్న విషయం తెలిసిందే. విపరీతమైన మంచుతో ప్రయాణీకులు, భక్తులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంతో ఆలయ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంటుంది. కేదారినాథ్‌తో పాటు, అమర్‌నాథ్‌ సహా చార్‌ధామ్‌ ఆలయాలను శీతాకాల సమయంలో మూసేస్తారు. 

Post Top Ad