హైదరాబాద్ లో మరో ఘోరం స్కూటీపైకి దూసుకెళ్లిన లారీ ... మహిళ మృతి.. - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, November 28, 2019

హైదరాబాద్ లో మరో ఘోరం స్కూటీపైకి దూసుకెళ్లిన లారీ ... మహిళ మృతి..


 హైదరాబాద్  ప్రతినిధి ( డి. శ్రీనివాసరావు) కాప్రాలోని రాధిక  సిగ్నల్ వద్ద జరిగిన  ప్రమాదంలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది.ఈసీఐఎల్‌కు చెందిన కోలాటి సరిత స్కూటీపై ఇంటికి వెళుతోంది. రాధిక సిగ్నల్ సమీపంలోకి రాగానే వెనుక నుంచి వచ్చిన లారీ  ఆమె స్కూటీని ఢీకొట్టింది. ఆ తర్వాత ఆమెతలపై నుంచి లారీ ముందుకు వెళ్లి ఆగింది. 

ఈ ప్రమాదంలో సరిత అక్కడికక్కడే మృతి 
చెందింది. లారీ  డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుందని ఘటనా స్థలంలో ఉన్నవారు చెప్పారు. లారీ డ్రైవర్ తప్పించుకునే ప్రయత్నం చేయగా  తనను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.కాగా, సరిత ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నట్లు స్థానికులు తెలిపారు.
ప్రమాదానికి  సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కాగా, మృతురాలి భర్త కోలాటి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.