జంట నగరాలలో 1000 సిటి బస్సుల రద్దు - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, December 08, 2019

జంట నగరాలలో 1000 సిటి బస్సుల రద్దు

హైదరాబాద్‌: పెరుగుతున్న కాలుష్యానికి విరుగుడుగా ఎలక్ట్రిక్‌ బస్సుల సంఖ్య పెంచటంతోపాటు సొంత వాహనాల స్థానంలో జనం వీలైనంత ఎక్కువగా ప్రజా రవాణా వాహనాల్లో ప్రయాణించేలా ప్రపంచవ్యాప్తంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకోసం ప్రజా రవాణా వ్యవస్థలను బలోపేతం చేస్తున్నారు. అయితే, దేశంలో కాస్మోపాలిటన్‌ సిటీగా శరవేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్‌లో మాత్రం పరిస్థితి విరుద్ధంగా కని పిస్తోంది. దాదాపు కోటి జనాభా ఉన్న మరే నగరంతో పోల్చినా సిటీ బస్సులు ఇక్కడే తక్కువ. కేవలం ప్రధాన రోడ్లపై మాత్రమే సిటీ బస్సులు నడుస్తుంటాయి. దీంతో అంతర్గత ప్రాంతాల ప్రజలు బస్సు కోసం కొంత దూరం వెళ్లక తప్పని పరిస్థితి.
ఈ నేపథ్యంలో ఈ సమస్యను అధిగమించ డానికి వీలైనన్ని ఎక్కువ బస్సులు అందుబాటులోకి తేవడం ద్వారా పెరిగిపోతున్న సొంత వాహనాల విస్తృతిని నియంత్రించాలని పలువురు సూచిస్తున్నారు. దీన్ని అనుసరించటం అటుంచి తే, ఇప్పుడు హైదరాబాద్‌లో ఏకంగా వేయి బస్సులను జనవరి 1 నాటికి తొలగించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో నగరంలో 2,700 బస్సులే ఉండనున్నాయి. పదేళ్ల క్రితం సిటీలో తిరిగిన బస్సుల సంఖ్యకిది సమానం. ఈ పదేళ్లలో హైదరాబాద్‌ లో 30 లక్షలకుపైగా జనాభా పెరిగింది. అందుకనుగుణంగా బస్సుల సంఖ్య పెరగాల్సి ఉండగా.. ఆర్టీసీ తిరోగమనంలో ఆలోచిస్తోంది.
నష్టాలను తగ్గించేందుకేనంటూ...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్టీసీ రూ.1200 కోట్ల నష్టాలను చవిచూడ నుందని అంచనా. ఇందులో రూ.550 కోట్ల నష్టం హైదరాబాద్‌ నుంచే ఉంటుందని చెబుతున్నారు. బస్సుల సంఖ్య పెరిగే కొద్దీ నష్టాలు పెరుగుతాయన్న సూత్రాన్ని అనుసరించి, బస్సుల సంఖ్య తగ్గించాలనే నిర్ణయానికి వచ్చారు. ఇటీవల సీఎం కేసీఆర్‌ నిర్వహించిన రెండు సమావేశాల్లో సిటీ బస్సులతో వస్తున్న నష్టాలపై చర్చ జరిగింది. మధ్యాహ్నం వేళ బస్సు లు ఒకదాని వెంట ఒకటి తిరుగుతున్నాయని, ఒక్కో బస్సులో పది, పదిహేను మందికి మించి ప్రయాణికులుండటం లేదని సీఎం పేర్కొన్నారు. నష్టాల నేపథ్యంలో ఇలా నడపడం ఎందుకని ప్రశ్నించారు. దీంతో అధికారులు ఇక బస్సుల సంఖ్య తగ్గించటమే మేలని నిర్ణయించారు.


Post Top Ad