మహిళల ఒంటిపై నగలు, వారి వద్ద ఉన్న డబ్బు కోసం ఏకంగా 16 మందిని హత్యచేసిన నరహంతకుడు, తన సొంత తమ్ముడ్ని కూడా వదలిపెట్టలేదు. కల్లు, మద్యం తాగే మహిళలనే లక్ష్యంగా చేసుకుని ఘాతుకాలకు పాల్పడిన నరరూప రాక్షసుడిని మహబూబ్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలోనే అనేక సార్లు జైలుకు వెళ్లినా అతడి ప్రవర్తనలో ఎలాంటి మార్పురాలేదు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం గుండేడ్ గ్రామానికి చెందిన ఎరుకుల శ్రీను మొత్తం 16 మందిని హత్యచేసినట్టు తెలిపారు.దేవరకద్ర మండలం నవాబుపేట మండలం కూచూరు గ్రామానికి చెందిన అలివేలమ్మ (53) అనే మహిళను గుర్తుతెలియని వ్యక్తులు డిసెంబరు 17న హత్యచేశారు. ఆమె మృతదేహాం వద్ద లభించిన ఆధారాలతో దీనిని హత్యగా నిర్ధారించిన పోలీసులు.. పాత నేరస్థుడు ఎరుకల శ్రీను పాత్ర ఉన్నట్లు అనుమానించారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. గతేడాది ఆగస్టులో జైలు నుంచి వచ్చిన తర్వాత నలుగుర్ని హత్యచేసినట్టు విచారణలో వెల్లడించాడు.కల్లు, మద్యం దుకాణాల వద్దకు వెళ్లే ఒంటరి మహిళలనే టార్గెట్‌గా చేసుకునే నిందితుడు... మాయ మాటలతో వారిని నమ్మించి తీసుకెళ్లి హత్యకు పాల్పడేవాడు. డిసెంబరు 16న మహబూబ్‌నగర్‌లోని ఓ కల్లు దుకాణానికి వెళ్లిన శ్రీను, అక్కడకు వచ్చిన అలివేలమ్మతో మాటలు కలిపాడు. దేవరకద్రలో ఒకరు తనకు రూ.20 వేలు ఇవ్వాల్సి ఉందని, వాటిని ఇప్పిస్తే రూ.4 వేలు ఇస్తానని ఆశపెట్టాడు. ఇది నిజమేనని నమ్మిన బాధితురాలు అతడి వెంట వెళ్లగా.. మార్గమధ్యలో ఇద్దరూ మద్యం సేవించారు. అనంతరం మత్తులో ఉన్న అలివేలమ్మపై దాడిచేసి, తలను నేలకేసి బాది హత్యచేశాడు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలు తీసుకుని పరారయ్యాడు.
Post Top Ad
Saturday, December 28, 2019
Home
తెలంగాణ
తెలంగాణ పోలీస్
నరహంతకుని వలేసి పట్టుకున్న పోలీసులు : 16 మంది మహిళలను హత్య చేసిన నరహంతకుడు
నరహంతకుని వలేసి పట్టుకున్న పోలీసులు : 16 మంది మహిళలను హత్య చేసిన నరహంతకుడు
Tags
# తెలంగాణ
# తెలంగాణ పోలీస్

About AUTHOR
తెలంగాణ పోలీస్
Tags
తెలంగాణ,
తెలంగాణ పోలీస్
Admin Details
Subha Telangana News