ప్రజా సమస్యల పై పాదయాత్ర ... నిజాంపేట్ 17వ వార్డు BJP ఇంచార్జి ఆకుల సతీష్..... - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, December 01, 2019

ప్రజా సమస్యల పై పాదయాత్ర ... నిజాంపేట్ 17వ వార్డు BJP ఇంచార్జి ఆకుల సతీష్.....

కూకట్పల్లి ప్రతినిధి (బొమ్మ శ్రీధర్ ): ఈరోజు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ నందు 17వ వార్డు నుంచి రెడ్డి అవెన్యూస్ మీదుగా శ్రీనివాస్ నగర్ కాల్ మీ ఎన్టీఆర్ నగర్ మీదుగా మరియు నల్ల పోచమ్మ టెంపుల్ వరకు భారతీయ జనతాపార్టీ 17వ వార్డు ఇంచార్జి ఆకుల సతీష్ ఆధ్వర్యంలో, 17వ వార్డు లో సమస్యలు పరిష్కరించాలని అని పాదయాత్ర (3km)మరియు సంతకాల సేకరణ జరిగింది.
ఈ  సందర్భంగా 17వ వార్డు ఇంచార్జి సతీష్ మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడి ఆరు నెలలు దాటుతున్నా ఎక్కడి సమస్యలు అక్కడే ఉండడం కాకుండా ,ఉన్న సమస్యలు పెరగడం ప్రజలు ముఖ్యంగా ప్రగతి నగర్ నుంచి నిజాంపేట వయా నల్ల పోచమ్మ టెంపుల్ కి వచ్చే దారి గత సంవత్సరంగా రిపేరింగ్ చేయక గుంతల మయం  చాలామంది కింద పడుతున్నారు. అంతేకాకుండా ఈ 17వ వార్డు లో వివిధ కాలనీల ఏ ఒక్క రోడ్డు కూడా బాగాలేదు,కాబట్టి తక్షణమే బాగు చేయాలని మరియు డ్రైనేజీ వర్షపు నీరు ఏ విధంగా ప్రత్యేకమైన నాళాలు మరియు తురక చెరువు పాపాయి కుంట నుండి మురుగు నీరు ,వర్షపు నీరు వెళ్లడానికి పైప్లైన్ ద్వారా గాని ఏర్పాటు చేయాలని మరియు శ్రీనివాస్ నగర్ కాలనీ పార్క్ పాపయ్య కుంట కట్టని మినీ ట్యాంక్ బండ్ తీర్చి దిద్దాలని ,అంతేకాకుండా  రెడ్డి అవెన్యూస్ నందు మంచినీరు మొక్కల పెంపకం తదితర సమస్యలు పరిష్కరించాలని, మధుర నగర్ లో వర్షం డ్రైనేజీ వెళ్లే విధంగా ఏర్పాటు చేయాలని.
నూతన రోడ్లు వేయాలని అంతేకాకుండా, ఎన్టీఆర్ నగర్ నందు పేద ప్రజలకి మంచి నీరు అవసరం మీరు ఉచితంగా ఇవ్వాలని ,కరెంట్ కనెక్షన్ ,భూమి పట్టాలు, డ్రైనేజీ వంటి వ్యవస్థల్ని  కల్పించాలని, అంతేకాకుండా శ్రీ బాలాజీ అపార్ట్మెంట్ దగ్గర వర్షం పడినప్పుడు చెరువు లాగా ఉంటుంది కాబట్టి తక్షణమే ఈ రోడ్డును బాగు చేసి ప్రజలు ఇబ్బందులకు గురి కాకుండా చూడాలని, 17వ వార్డు నందు దోమల నివారణకి, చెత్త సేకరణ ,పచ్చదనం పరిశుభ్రత పై శ్రద్ధ పెట్టాలని అంతేకాకుండా ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తూ సమస్యల పరిష్కారంలో మున్సిపల్ మరియు ప్రభుత్వ వ్యవస్థలు అలసత్వం పనికిరాదని, ప్రజా సమస్యల పరిష్కారంలో వేగవంతం చేయాలని.
ప్రజలకు ఉన్న సమస్యల్ని గ్రామపంచాయతీలు పరిష్కారం లేక కనీసం కార్పొరేషన్ తీరుతాయని ఎదురుచూస్తున్న ఎండమావిగానే కనిపిస్తుందని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో నరసింహా రెడ్డి గారు జిల్లా కార్యవర్గ సభ్యులు, శిల్ప రెడ్డి గారు రాష్ట్ర మహిళా కార్యదర్శి ,చౌదరి ,నరేష్ గుప్తా ,రాజశేఖర్రెడ్డి ,సామ్రాజ్య లక్ష్మి ,మాధవరావు, రంజిత్ , శ్రీనివాసరావు ,శ్యామ్, గౌతం తదితరులు పాల్గొన్నారు.....

Post Top Ad