జనవరి 2 నుండి పది రోజులపాటు ‘పల్లె ప్రగతి’ మరో మారు అమలు : మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, December 13, 2019

జనవరి 2 నుండి పది రోజులపాటు ‘పల్లె ప్రగతి’ మరో మారు అమలు : మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

తెలంగాణ గ్రామ అభివృద్దే లక్ష్యంగా తెలంగాణ సర్కార్ మరో కీలక ముందడుగు.  జనవరి 2 నుంచి పది రోజుల పాటు మరో మారు ‘పల్లె ప్రగతి’ కార్యక్రమాన్ని అమలు చేస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వెల్లడించారు. గ్రామాల సమగ్రాభివృద్ధిలో పంచాయతీ కార్మికులు, కారోబార్లదే కీలకపాత్ర అని అన్నారు. పచ్చదనం, పరిశుభ్రత ఉట్టిపడేలా గ్రామాలను తీర్చిదిద్దుకోవాలని.. ఉద్యోగం కోసం కాకుం డా సొంత ఊరి కోసం పనిచేస్తున్నామనేలా పనితీరు ఉండాలని సూచించారు.
గ్రామ పంచాయతీ కార్మికుల వేతనం పెంచినందు కుగానూ సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ గురువారం తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ కార్మిక విభాగం ఏర్పాటు చేసిన సమా వేశంలో ఎర్రబెల్లి మాట్లాడారు. ఈ సమావేశంలో రైతు సమన్వయ సమితి చైర్మన్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.