హైదరాబాద్ 2020 లో మొదలెట్టే కార్యక్రమాల గూర్చి తెలిపిన కేటీర్ - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, December 30, 2019

హైదరాబాద్ 2020 లో మొదలెట్టే కార్యక్రమాల గూర్చి తెలిపిన కేటీర్

హైదరాబాద్‌లో బీఆర్‌టీఎస్‌ (బస్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌)లో కూకట్‌పల్లి, హైటెక్‌ సిటీ, గచ్చిబౌలి ఏరియాలను కలిపే ప్రణాళిక ప్రారంభమైందన్నారు. పాతబస్తీకి కూడా మెట్రో రైలు సౌకర్యం వస్తుందని కేటీఆర్‌ తెలిపారు. హైదరాబాద్‌ తూర్పు వైపు ఐటీ పరిశ్రమలను తీసుకెళ్లాలని తాము చేస్తున్న ప్రయత్నానికి మంచి స్పందన వస్తోందన్నారు. గోపనపల్లిలో విస్తృతంగా పెరుగుతున్న పలు గేటెడ్‌ కమ్యూనిటీలకు ఫైనాన్సియల్‌ డిస్ట్రిక్ట్‌ నుంచి రోడ్డు లేదని, దీన్ని నూతన స్లిప్‌ రోడ్డు నిర్మాణంలో కవర్‌ చేస్తామన్నారు. ఎల్బీనగర్‌లో ఇప్పటికే ఒక ఫ్లైఓవర్‌ పూర్తయిం దని మరో మూడు ఫ్లై ఓవర్ల నిర్మాణాలు వస్తాయ న్నారు. 111 జీవోలో ఏదైనా మార్పు, చేర్పులు అవసరమైతే ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. అనంతగిరి, వికారాబాద్‌ ప్రాంతాలను గత ప్రభుత్వాల మాదిరిగా నిర్లక్ష్యం చేస్తారా అన్న ప్రశ్నకు ఈ ప్రాంతాల అభివృద్ధి కోసం అనేక ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని వాటి ఫలాలు త్వరలో చూస్తారని చెప్పారు.