వచ్చే వర్షాకాల సీజన్ ముందు కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల్లో తమకు 157 టీఎంసీల అవసరాలుంటాయని రాష్ట్రం తేల్చింది. శ్రీశైలంప్రాజెక్టుపై ఆధారపడ్డ కల్వకుర్తి ఎత్తిపోతలకు 22 టీఎంసీలు, నాగార్జునసాగర్ కింద హైదరాబాద్ తాగునీరు, ఏఎంఆర్పీ, మిషన్ భగీరథ అవసరాలకు కలిపి 45 టీఎంసీలు, ఎడమ కాల్వ కింద అవసరాలకు 90 టీఎంసీలు కలిపి మొత్తంగా 135 టీఎంసీలు అవసరం ఉంటుందని పేర్కొంది. ఇక ఈ వాటర్ ఇయర్లో కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల్లో తెలుగు రాష్ట్రాలు 645.36 టీఎంసీల మేర వినియోగించుకోగా తెలంగాణ వాటా 219 టీఎంసీలుగా ఉందని, అయితే అందులో రాష్ట్రం 148 టీఎంసీలు మాత్రమే వినియోగించిందని తెలిపింది. ప్రస్తుతం శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టుల్లో కనీస నీటి మట్టాలకు ఎగువన 250 టీఎంసీల మేర నీటి లభ్యత ఉందని, అందులో తెలంగాణకు 160 టీ ఎంసీల మేర వాటా ఉంటుందని దృష్టికి తెచ్చింది. ఈ మేరకు వచ్చే ఏడాది మే చివరి వరకు తమ అవసరాలను పేర్కొంటూ కృష్ణా బోర్డుకు లేఖ రాసింది.
Post Top Ad
Sunday, December 29, 2019
తెలంగాణ వాటా 219 టీఎంసీలు....కృష్ణా బోర్డుకు లేఖ ...
Admin Details
Subha Telangana News