తెలంగాణ లో లోక కల్యాణం, విశ్వమానవ శ్రేయస్సు కోసం జనవరి 2 నుంచి 5వ తేదీ వరకు హైదరాబాద్లో అశ్వమేధ గాయత్రి మహాయజ్ఞం నిర్వహించనున్నట్టు గాయత్రి పరివార్ ప్రతినిధులు తెలిపారు. యజ్ఞాన్ని మైసమ్మగూడ మల్లారెడ్డి మహిళా ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో నాలుగురోజులపాటు నిర్వహిస్తామన్నారు. అఖిల విశ్వగాయత్రి పరివార్ శాంతికుంజ్ హరిద్వార్ సారథ్యంలో 551 యజ్ఞకుండాలతో మహాయజ్ఞం నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఇందులో అందరూ పాల్గొనవచ్చని, యాత్రికులకు ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పిస్తున్నట్టు తెలిపారు.
Post Top Ad
Admin Details
Subha Telangana News