సంక్రాంతి సందర్భంగా 4940 అదనపు బస్సులను సిద్ధం చేస్తున్న హైదరాబాద్ RTC డిపోలు - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, December 26, 2019

సంక్రాంతి సందర్భంగా 4940 అదనపు బస్సులను సిద్ధం చేస్తున్న హైదరాబాద్ RTC డిపోలు

 రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున జరుపుకునే పండగల్లో ఒకటి  సంక్రాంతి.   ఇప్పటికే తమ సొంత ఊర్లకు చేరుకునేందుకు ప్రజలు టికెట్లు రిజర్వేషన్‌ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఎంజీబీఎస్‌లోని రంగారెడ్డి ఆర్‌ఐ కార్యాలయంలో ఆర్టీసీ అధికారులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంక్రాంతి సందర్భంగా 4940 అదనపు బస్సులను  సిద్ధం చేసినట్లు రంగారెడ్డి రీజినల్‌ మేనేజర్‌ వరప్రసాద్‌ తెలిపారు. వీటిలో తెలంగాణకు 3414 బస్సులను ఆంధ్ర ప్రాంతానికి 1526 బస్సులను అదనంగా కేటాయించామన్నారు.. జనవరి 9వ తేది నుంచి 13 వరకు ఈ అదనపు బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. అలాగే ఊర్ల నుంచి తిరిగి వచ్చే వారి కోసం జనవరి 17న అదనపు బస్సలు నడుపుతున్నామన్నారు. సంక్రాంతి సందర్భంగా గతేడాది రూ. 5 కోట్ల అదనపు ఆదాయం వచ్చిందని, ఈ ఏడాది రూ. 6 కోట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.