55వ జ్ఞానపీఠ్ పురస్కారానికి ఎంపిక అయిన మలయాళ సాహితీవేత్త అక్కితమ్ - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, December 01, 2019

55వ జ్ఞానపీఠ్ పురస్కారానికి ఎంపిక అయిన మలయాళ సాహితీవేత్త అక్కితమ్

అక్కితమ్‌ను 55వ జ్ఞానపీఠ్ పురస్కారానికి ఎంపికచేసినట్లు జ్ఞానపీఠ్ ఎంపిక బోర్డు చైర్మన్ ప్రతిభా 2019, నవంబర్ 29న ప్రకటించారు. మలయాళ సాహితీవేత్తల్లో ప్రముఖుడైన అక్కితమ్ కేరళలోని పాలక్కడ్ జిల్లాలో గల కుమారనెల్లూర్‌లో 1926, మార్చి 18న జన్మించారు. అక్కితమ్ కవితలతోపాటు నాటకాలు, విమర్శనాత్మక వ్యాసాలు, పిల్లల సాహిత్యం, కథలు, అనువాదాల్లోనూ తనదైన ముద్ర వేశారు. ఇప్పటి వరకు 55 పుస్తకాలు రాశారు. మలయాళీ సాహిత్యంలో ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2017లో పద్మశ్రీ అవార్డు అందించింది. సాహిత్య అకాడమీ అవార్డు, కేరళ సాహిత్య అకాడమీ అవార్డు, కబీర్ సమ్మాన్ వంటి పురస్కారాలను అక్కితమ్ అందుకున్నారు.

Post Top Ad