జనవరి 8 న బంద్ - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, December 01, 2019

జనవరి 8 న బంద్

దేశంలో రైతాంగ సమస్యలపై జనవరి 8న గ్రామీణ భారత్‌ బంద్‌కు అఖిలభారత కిసాన్‌ సంఘర్ష్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీ (ఏఐకేఎస్‌సీసీ) జాతీయ సదస్సు నిర్ణయించింది. రెండు రోజులపాటు ఢిల్లీలో జరిగిన ఏఐకేఎస్‌సీసీ మూడో జాతీయ సదస్సు శనివారం ముగిసింది. ఈ సదస్సులో 25 రాష్ట్రాల నుంచి 800 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. 21 అంశాలపై రైతుల చార్టర్‌ ఆఫ్‌ డిమాండ్స్‌ను తయారు చేసి, సదస్సులో చర్చించారు. జనవరి 8న గ్రామీణ భారత్‌ బంద్‌కు ముం దు ఏఐకేఎస్‌సీసీ రాష్ట్ర కమిటీలు రాష్ట్ర, జిల్లాస్థాయిల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. అటవీ హక్కుల చట్టం, భూసేకరణ పరిహారం, పునరావాస చట్టం-2013 అమలు చేయాలని, గిరిజనులు, రైతుల వద్ద నుంచి భూములను బలవంతంగా తీసుకోవడాన్ని వ్యతిరేకించాలని, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల వల్ల ఇతర దేశాల్లోని వ్యవసాయ ఉత్పత్తులు పెద్దఎత్తున వచ్చి రైతులు నష్టపోతున్నారని, వ్యవసాయ రంగంలో బహుళజాతి కం పెనీల ఆధిపత్యాన్ని నియంత్రించాలని, వ్యవసాయ కార్మికు ల కోసం సమగ్ర చట్టం, కార్పొరేట్‌ దోపిడీకి వ్యతిరేకంగా రైతులకు, దేశంలోని గ్రామీణ కార్మికులకు రూ.10,000 పెన్షన్‌ ఇవ్వాలని, పంటల బీమా, విపత్తు పరిహారాన్ని పునరుద్ధరించాలని, జమ్ముకాశ్మీర్‌ రైతులు ఎదుర్కొంటున్న నష్టాలకు పరిహారం ఇవ్వాలని తీర్మానాలను సదస్సు ఆమోదించింది. ఈ సందర్భంగా ఏఐకేఎస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి హన్నన్‌ మొల్లా మీడియాతో మాట్లాడా రు. భూమిలేని రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆర్థిక భరోసా ఇవ్వాలన్నారు. దేశ రాజకీయాల్లో రైతుల సమస్యలే ప్రధాన ఎజెండాగా మారాలని అన్నారు. రైతు వ్యతిరేక విధానాలతో మోడీ సర్కారు రైతాంగంపై దాడి చేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. కరువు నివారణ చర్యలు పటిష్టంగా చేయాలని కోరారు. ఈ సమావేశంలో వీఎం సింగ్‌, మేధా పాట్కర్‌, కిరణ్‌ విస్తా, తెలంగాణ రైతు సంఘం సహాయ కార్యదర్శి శోభన్‌నాయక్‌ పాల్గొన్నారు.

Post Top Ad