అనూహ్యంగా మహిళల కోసం ప్రత్యేకబిల్లు : AP CM జగన్ - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, December 11, 2019

అనూహ్యంగా మహిళల కోసం ప్రత్యేకబిల్లు : AP CM జగన్

 అనూహ్యంగా మహిళల కోసం ప్రత్యేకబిల్లు తీసుకురానున్న AP CM జగన్  , రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలకు పాల్పడితే మరణశిక్ష విధించేలా సరి కొత్త చట్టం తేవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా భారత శిక్షా స్మృతి(ఐపీసీ-ఇండియన్‌ పీనల్‌ కోడ్‌)లోని సెక్షన్‌ 354కు సవరణలు చేసి.. కొత్తగా 354-ఈని చేర్చనుంది. మహిళలు, చిన్నారులపై అత్యాచారాలకు, అఘాయిత్యాలకు పాల్పడితే.. అలాంటి కేసులపై వారం రోజుల్లోగా విచారణ పూర్తి చేసి, ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు చేసి రెండు వారాల్లోగా ట్రయల్‌ పూర్తి చేసి శిక్షపడేలా చేయడం ఈ చట్టం ఉద్దేశం.
ఇలాంటి కేసుల్లో రెడ్‌ హ్యాండెడ్‌గా ఆధారాలుంటే నిందితులకు మూడు వారాల్లోగా ఉరిశిక్ష విధించడానికి ఈ చట్టం దోహదం చేస్తుంది. ఈ విప్లవాత్మక చట్టాన్ని అమల్లోకి తేవడానికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నడుంబిగించారు. ఇందుకు సంబంధించిన బిల్లుపై చర్చించి.. ఆమోదించడానికి సీఎం వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో మంత్రివర్గం బుధవారం సమావేశం కానుంది. మహిళా భద్రత బిల్లుపై ఆమోదముద్ర వేశాక శాసనసభ, మండలిలో దీన్ని ప్రవేశపెట్టనున్నారు.