ఇద్దరు ఆడపిల్లల తండ్రిగా, ఓ చెల్లెలికి అన్నగా, ఓ భర్తగా దిశకు జరిగిన అన్యాయం చాలా బాధ కలిగించిందని సీఎం జగన్ అన్నారు. తెలంగాణ పోలీసులు చర్య అభినందనీయమని పేర్కొన్నారు. ‘నాకూ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఓ చెల్లెలు ఉంది. ఓ భార్య ఉంది. ఒకే ఒక భార్య ఉంది. దిశ ఘటన తర్వాత ఇలాంటి ఘటనలు మన రాష్ట్రంలోనూ జరిగితే ఏం చేయాలి? అనే ప్రశ్న తలెత్తింది. ఆడపిల్లలకు మరింత రక్షణ కల్పించేలా చట్టాల్లో మార్పులు చేస్తాం. మూడు వారాల్లో ఉరి శిక్ష పడేలా చర్యలు తీసుకుంటాం’ అని జగన్ పేర్కొన్నారు.
దిశ నిందితుల ఎన్కౌంటర్ ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఆడపిల్లపై టోల్ ప్లాజా వద్ద జరిగిన అఘాయిత్యం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ఘటనపై తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు వేగంగా స్పందించారని కొనియాడారు. సభ్యుల హర్షధ్వానాల మధ్య ‘హ్యాట్స్ఫ్ టు కేసీఆర్, తెలంగాణ పోలీస్..’ అంటూ సీఎం జగన్ అసెంబ్లీ వేదికగా ప్రశంసలు కురిపించారు. శాసనసభలో సోమవారం (డిసెంబర్ 9) మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )