తమిళనాడు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు భారీ వర్షాలు - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, December 01, 2019

తమిళనాడు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు భారీ వర్షాలు

చెన్నై : తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు జిల్లాల్లో గోడలు కూలిన ఘటనల్లో వికలాంగరాలితో సహా ఇద్దరు మృత్యువాత పడ్డారు. తంజావూర్‌ జిల్లాలోని ఒక గ్రామంలో గోడ కూలి మీద పడటంతో దురైకన్ను అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ విషయాన్ని స్థానికులు శనివారం ఉదయం గుర్తించి ఆయన కుమారుడికి తెలియజేశారు. అరియలూర్‌ జిల్లాలో శనివారం ఉదయం పాడుబడిన భవనానికి చెందిన గోడ కూలి పడటంతో ఎస్‌.పూగంతరు అనే వికలాంగురాలు దుర్మరణం చెందారు. పాపనాశం తాలూకా ఆర్యాపురం శివార్లలోని మెట్టు స్ట్రీట్‌లో ఓ ఇంటి గోడ కూలింది. అయితే ఎవరూ గాయపడలేదు. తమిళనాడులోని పలు జిల్లాలను శనివారం కూడా వర్షాలు ముంచెతుతున్నాయి. నాగపట్నం, తిరువరూర్‌్‌, పుదుకొట్టారు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. వల్లం, తంజావూర్‌ల్లో శుక్రవారం అధిక వర్షపాతం (97 మిమి) నమోదైందని సంబంధిత అధికారులు తెలిపారు.

Post Top Ad