కరీంనగర్ కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్ పైన బదిలీ వేటు వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొంత కాలంగా కలెక్టర్ వ్యవహారం పైన అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. కొద్ది కాలం క్రితం కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్ సంజయ్‌కుమార్‌తో ఫోన్లో మాట్లాడిన సంభాషణపై ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీని పైన పూర్తి సమాచారం సైతం కోరింది. మంత్రి గంగులపై అనర్హత కేసు వేసేందుకు కలెక్టర్ సంజయ్‌కి సహకారం అందించారనే అభిప్రాయాన్ని కలిగించేలా ఉన్న ఈ ఫోన్ సంభాషణపైన సీఎం ఆగ్రహంతో ఉన్నట్లుగా పార్టీలో ప్రచారం సాగింది. దీంతో.. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నుంచి పిలుపు రావడంతో కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్ హైదరాబాద్‌కు వెళ్లి ఈ వ్యవహారంలో తన వాదనను వినిపించారు. జరిగిన వ్యవహారం పైన వివరణ ఇచ్చారు. ఇదే అంశాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రభుత్వానికి నివేదించినట్లుగా సమాచారం.
Post Top Ad
Monday, December 16, 2019
కరీంనగర్ కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్ పైన బదిలీ వేటు
Admin Details
Subha Telangana News