ఏపీ పై తెలంగాణ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, December 29, 2019

ఏపీ పై తెలంగాణ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

తెలంగాణ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి. ఏపీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు తెలంగాణకు అనుకూలంగా మారుతాయంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఏపీలో పరిస్థితులు తెలంగాణ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కలిసి వస్తాయని చెప్పుకొచ్చారు. ఈ అవకాశాన్ని రియల్ వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అనేక నగరాల్లో అనేక రకాల సమస్యలు ఉన్నాయని.. హైదరాబాద్‌లో ఎలాంటి సమస్యలూ లేవన్నారు.ప్రస్తుతం తెలంగాణలో రియల్‌ ఎస్టేట్‌ రంగం దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఎంతో మెరుగ్గా ఉందని హరీష్ చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు ఏపీలో ప్రస్తుతం కొనసాగుతున్న రాజధాని సమస్య మీద తెలంగాణలో ఏ నేత స్పందించలేదు. కానీ, మంత్రి హరీష్ పరోక్షంగా ఈ అంశాన్ని ప్రస్తావించారు.ఏపీలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు తెలంగాణకు కలిసి వస్తాయని మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం ఏపీలో రాజధాని పైన నెలకొన్న వివాదం..ప్రాంతాల వారీగా వస్తున్న డిమాండ్లను పరిగణలోకి తీసుకొని ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు కలిసివస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తెలంగాణలో రియల్‌ ఎస్టేట్‌ రంగం దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఎంతో మెరుగ్గా ఉందన్నారు. బ్యూరోక్రాట్లు.. వ్యాపార వేత్తలు హైదరాబాద్ లో స్థిరనివాసం ఏర్పాటు చేసుకునేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నారని చెప్పారు.దీంతో..ఇప్పుడు ఈ వ్యాఖ్యలు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారాయి.