కేంద్ర పథకాల కంటే తెలంగాణ పథకాలే ప్రజలకు ఎక్కువ మేలు చేకూరుస్తాయి : రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, December 10, 2019

కేంద్ర పథకాల కంటే తెలంగాణ పథకాలే ప్రజలకు ఎక్కువ మేలు చేకూరుస్తాయి : రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్


కేంద్ర పథకాల కంటే తెలంగాణ పథకాలే ప్రజలకు ఎక్కువ మేలు చేకూరుస్తాయి : రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకంతో పోల్చుకుంటే తెలంగాణలోని ఆరోగ్యశ్రీ పథకం ఎంతో మంచిదని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో రూ.16.80 కోట్ల నిధులతో నిర్మించనున్న వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి మంత్రి ఈటల రాజేందర్ ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు.
 టీఆర్‌ఎస్ సర్కారు చేతల ప్రభుత్వమే కానీ, మాటల ప్రభుత్వం కాదని అన్నారు. ఒకప్పుడు పరిస్థితి ఒకలా ఉంటే, తెలంగాణ వచ్చిన అనంతరం నుంచి మార్పు కనిపిస్తోందని వివరించారు. ఆయా శాఖలకు వస్తున్న పురస్కారాలు అడుక్కుంటే వస్తున్నవి కావని, చక్కగా పనిచేస్తున్నాం కాబట్టే తమను వరిస్తున్నాయని చెప్పారు. ఆశా కార్మికులను ఆదుకున్న ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ అని మంత్రి పేర్కొన్నారు. విద్య, వైద్య రంగాల్లో తమిళనాడు, కేరళ రాష్ట్రాల స్థాయులు అందుకుంటున్నట్లు వెల్లడించారు. మెరుగైన వైద్య సౌకర్యాలు అందించేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అమలు చేస్తున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజల విశ్వాసం చూరగొనడం లక్ష్యంగా పని చేస్తున్నట్లు వివరించారు.

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )