పురపాలికల ఎన్నికల వాయిదా ... ఎస్‌ఈసీ నుంచి నిరాకరణ - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, December 29, 2019

పురపాలికల ఎన్నికల వాయిదా ... ఎస్‌ఈసీ నుంచి నిరాకరణ

పురపాలికల ఎన్నికల నిర్వహణకు , ఏర్పాట్లకు సంబంధించి రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నిర్వహించిన సమావేశం జరిగింది. సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకుని మున్సిపల్‌ ఎన్నికల తేదీలను రీషెడ్యూల్‌ చేయాలంటూ తాము చేసిన విజ్ఞప్తిపై ఎస్‌ఈసీ నుంచి సానుకూలత వ్యక్తం కాలేదని కాంగ్రెస్, ఇతర పార్టీల నేతలు పేర్కొన్నారు. తాము ఇచ్చిన సలహాలు, సూచనలను పట్టించుకోకపోగా ఎస్‌ఈసీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని, అధికారపార్టీకి తొత్తుగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ కాంగ్రెస్‌నేతలు మర్రి శశిధర్‌రెడ్డి మరియు కాంగ్రెస్ నేతలు పలువురు  సమావేశం నుంచి వాకౌట్‌ చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ వి.నాగిరెడ్డి పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారని, అఖిలపక్ష సమావేశంలో ఆయన ఉపయోగించిన పరుష పదజాలానికి నిరసనగా సమావేశాన్ని బాయ్‌కాట్‌ చేస్తున్నట్లు పేర్కొన్నారు. రిజరేషన్లు ప్రకటించాకే ఎన్నికలు నిర్వహించాలని కోరితే తనపై దాడి చేశారని, వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతానని దళిత బహుజన పార్టీ నేత కృష్ణ స్వరూప్‌ ఆరోపించారు. టీఆర్‌ఎస్, ఎంఐఎం మినహా దాదాపు మిగతా అన్ని పార్టీలు ఎన్నికల తేదీలు రీ షెడ్యూల్‌ చేయాలని డిమాండ్‌ చేశాయి.