మోడీ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పద్మశ్రీ పురస్కారం తెరిగి ఇచ్చేయనున్న ముజ్తాబా హుస్సేన్ - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, December 18, 2019

మోడీ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పద్మశ్రీ పురస్కారం తెరిగి ఇచ్చేయనున్న ముజ్తాబా హుస్సేన్

మోడీ  ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పద్మశ్రీ పురస్కారం తెరిగి ఇచ్చేయనున్న ముజ్తాబా హుస్సేన్ :  పౌరసత్వం చట్టం(సీఏఏ), జాతీయ పౌర జాబితా(ఎన్ఆర్సీ)లకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రతిపక్ష పార్టీలతోపాటు ప్రముఖులు కూడా వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్న వారికి మద్దతుగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నగరానికి చెందిన ప్రముఖ ఉర్దూ రచయిత, హాస్యవేత్త ముజ్తాబా హుస్సేన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.తన పద్మశ్రీ పురస్కారాన్ని ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేస్తానని ముజ్తాబా హుస్సేన్ బుధవారం ప్రకటించారు. పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర జాబితా అంశాలకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. దేశంలో పరిస్థితి నానాటికీ దిగజారుతోందని ఆయన అన్నారు.