జాతీయ పౌర జాబితా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో భారీ నిరసన ప్రదర్శలు జరిగాయి. గురువారం కరీంనగర్లో ముస్లిం జేఏసీ ఆధ్యర్వంలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. స్థానిక తెలంగాణ చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు జరిగిన ఈ ర్యాలీలో పలు ముస్లిం సంఘాలు పాల్గొన్నాయి. కలెక్టరేట్ వద్దకు చేరుకున్న తర్వాత అక్కడ నిరసనకారులు ధర్నాకు దిగారు. సీఏఏ, ఎన్నార్సీలను ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. మరోవైపు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోనూ భారీ ర్యాలీ జరిగింది. పట్టణంలోని ఈద్గా నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ఆర్డీవో కార్యాలయం వరకు కొనసాగింది. దీనిలో ఎమ్మెల్యే జోగు రామన్న కూడా పాల్గొన్నారు. ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్న తర్వాత జోగు రామన్న, ఇతర పార్టీల నాయకులు కలిసి ఆర్డీవో సూర్యనారాయణకు వినతిపత్రాన్ని అందజేశారు.
Post Top Ad
Friday, December 27, 2019
Admin Details
Subha Telangana News