నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ కి తెలంగాణవాసి కుమార్ యాదవ్ ఎంపిక - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, December 02, 2019

నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ కి తెలంగాణవాసి కుమార్ యాదవ్ ఎంపిక

నెహ్రూయువ కేంద్ర మరియు కేంద్ర యువజన సర్వీసుల శాఖ నుండి తెలంగాణ వాసి కుమార్ యాదవ్ ని హర్యానా రాష్ట్రంలో ఈ నెల 8 తేదీ నుండి 12 వ తేది వరకు జరిగే నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంపు కి ఎంపిక చేసినట్టు ఒక ప్రకటనలో తెలిపారు..ఈ ఎంపిక పట్ల కుమార్ యాదవ్ మాట్లాడుతూ NIC కి సెలెక్ట్ అవడం చాలా సంతోషంగా ఉంది,కేంద్ర ప్రభుత్వ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ క్యాంప్ లో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలపైన మాట్లాడి వివిధ రాష్ట్రాల నుండి వచ్చే యువతకు తెలిసే ప్రయత్నం చేస్తానన్నారు..
శేరిలింగంపల్లి నియోజక వర్గంలో యువత అభివృద్ధి కార్యక్రమాలు, మరియు కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు, సమాజ సేవ కార్యక్రమాలు నిర్వహించినందుకు నాకు జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన క్యాంప్ లో అవకాశం దొరికింది అన్నారు. అలాగే నా కార్యక్రమాలకు వెన్ను దండిగా వుండి నన్ను ప్రోత్సహించిన పెద్దలకు మరియు సహకరించిన  వారందరికీ ధన్యవాదాలు తెలిపారుPost Top Ad