రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హైదరాబాద్‌లో శీతాకాల విడిది ముగిసింది. ఈ నెల 20న నగరానికి వచ్చిన ఆయన శనివారం ఉదయం తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాష్ట్రంలోని పలువురు ప్రముఖులకు రాష్ట్రపతి తేనేటి విందు ఏర్పాటుచేశారు.బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో జరిగిన ఎట్‌హోం కార్యక్రమంలో గవర్నర్ తమిళిసైసౌందర్‌రాజన్, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతోపాటు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సుభాష్‌రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్రసింగ్ చౌహాన్, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అమర్నాథ్గౌడ్, జస్టిస్ అభిషేక్‌రెడ్డి, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, మంత్రులు మహమూద్ అలీ, జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, సత్యవతి రాథోడ్, మల్లారెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీలు సంతోష్‌కుమార్, రంజిత్‌రెడ్డి, బండా ప్రకాశ్, బడుగుల లింగయ్యయాదవ్, మాలోతు కవిత, ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్, ఎమ్మెల్యేలు కాలె యాద య్య, తాటికొండ రాజయ్య, బేతి సుభాష్‌రెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్, రేఖానాయక్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎం శ్రీనివాస్‌రెడ్డి, నారదాసు లక్ష్మణ్‌రావు, యెగ్గె మల్లేశం, నవీన్‌కుమార్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజేశంగౌడ్ పాల్గొన్నారు.
Post Top Ad
Saturday, December 28, 2019
ముగిసిన శీతాకాల విడిది
Admin Details
Subha Telangana News