గద్వాల జిల్లా మానవపాడు తహసీల్దార్ కార్యాలయంలో మరో ఆత్మహత్యాయత్నం - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, December 11, 2019

గద్వాల జిల్లా మానవపాడు తహసీల్దార్ కార్యాలయంలో మరో ఆత్మహత్యాయత్నం

జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు తహసీల్దార్ కార్యాలయంలో ఓ రైతు తన భూ సమస్య పరిష్కరించాలంటూ అధికారుల చుట్టూ తిరిగి విసిగి వేసారిపోయిన ఓ రైతు తన సమస్యకు పరిష్కారం లభించకపోవటంతో ఆత్మహత్యకు ప్రయత్నించాడు . చివరకు తహసీల్దార్ కార్యాలయం ఎదుటే ఆత్మహత్య చేసుకోవాలని భావించిన రైతు శేఖర్ రెడ్డి తనతో పాటు పెట్రోల్ తెచ్చుకుని తహసీల్దార్ కార్యాలయం ముందు ఆత్మహత్యకు పాల్పడ్డాడు .

తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ ను శరీరంపై పోసుకున్న రైతు శేఖర్ రెడ్డి ఆత్మహత్యకు ప్రయత్నం చెయ్యటంతో అక్కడి వారు వెంటనే అతన్ని వారించి ఆపారు. అక్కడే ఉన్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది అడ్డుకున్నారు. తన భూమి సమస్య పరిష్కరించడం లేదని రైతు ఆవేదన చెందాడు. అతడి సమస్యను పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.