మరో సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ ముఖ్య మంత్రి : కేసీర్ - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, December 18, 2019

మరో సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ ముఖ్య మంత్రి : కేసీర్

మరో సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ ముఖ్య మంత్రి కెసిఆర్ :కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా భూముల ధరలను పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. భూముల పెంపునకు సంబంధించిన ప్రతిపాదనలను స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సిద్ధం చేస్తోందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ భూముల ధరల పెంపు అంశాన్ని ప్రస్తావించారని కొందరు అధికారులు తెలిపారు.
సీఎం ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు ప్రతిపాదనల రూపకల్పనలో తల మునకలైనట్లుగా తెలుస్తోంది. ఈ కసరత్తులో భాగంగా ప్రభుత్వ అధికారులు రియల్టర్లతో కూడా చర్చలు జరిపినట్లు సమాచారం. తాము రూపొందించిన ప్రతిపాదనలతో త్వరలో ముఖ్యమంత్రికి నివేదిక అందజేయనున్నట్లు ఓ అధికారి వెల్లడించారు.