తెలంగాణ పోలీసులపై త్రిసభ్య కమిటీ తో న్యాయ విచారణ - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, December 13, 2019

తెలంగాణ పోలీసులపై త్రిసభ్య కమిటీ తో న్యాయ విచారణ

దిశ హత్యాచారం ఘటనలో నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడంపై సుప్రీంకోర్టు న్యాయ విచారణకు ఆదేశించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ వి.ఎస్‌. సిర్పుర్కర్‌ నేతృత్వంలోని త్రిసభ్య కమిషన్‌ న్యాయ విచారణ చేపడుతుందని పేర్కొంది. బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ రేఖా ప్రకాశ్‌ బాల్డోట, సీబీఐ మాజీ డైరెక్టర్‌ డి.ఆర్‌.కార్తి కేయన్‌ ఇందులో సభ్యులుగా ఉంటారని తెలిపింది. హైదరా బాద్‌ కేంద్రంగా పనిచేసే ఈ కమిషన్‌.. విధులు ప్రారంభించిన తొలి రోజు నుంచి ఆరు నెలల్లోగా విచారణ పూర్తి చేసి నివేదికను సమర్పిస్తుందని వెల్లడించింది. అప్పటి వరకు ఏ ఇతర కోర్టులూ ఎన్‌కౌంటర్‌ మరణాలపై విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని స్పష్టంచేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ శరద్‌.ఎ. బాబ్డే నేతృత్వంలోని జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం గురు వారం ఆదేశాలు జారీచేసింది. నిందితులను బూటకపు ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపారని, బాధ్యు లపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశిం చాలని కోరుతూ జి.ఎస్‌.మణి, ప్రదీప్‌కుమార్‌ యాదవ్, ఎంకే శర్మ, మనోహర్‌లాల్‌ శర్మలు దాఖలు చేసిన మూడు పిటి షన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది.

Post Top Ad