రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ ఛైర్మన్‌ వినోద్‌కుమార్‌ను కలిసిన కొంకన్‌ బ్యాంబు బృందం - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, December 28, 2019

రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ ఛైర్మన్‌ వినోద్‌కుమార్‌ను కలిసిన కొంకన్‌ బ్యాంబు బృందం

రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ ఛైర్మన్‌ వినోద్‌కుమార్‌ను కొంకన్‌ బ్యాంబు బృందం కలిసింది. మహారాష్ట్ర, గోవా, కర్ణాటక రాష్ట్రాల్లో బ్యాంబు సాగు వివరాలను వినోద్‌ కుమార్‌కు బృందం వివరించింది. కర్ణాటక, గోవా సరిహద్దుల్లోని కుడాల్‌ ప్రాంతంలో 15వేల ఎకరాల్లో బ్యాంబు సాగు చేస్తున్నట్లు కొంకన్‌ బృందం తెలిపింది. సాగుచేసిన రైతులు ఎకరానికి రూ.లక్ష ఆదాయం పొందుతున్నారని చెప్పారు. కుడాల్‌ బ్యాంబు క్షేత్రాన్ని పరిశీలించేందుకు గోవాలో పర్యటించాలని వినోద్‌ కుమార్‌ను ఆహ్వానించారు. తెలంగాణలో కూడా బ్యాంబు సాగుకు వాతావరణం అనుకూలం అని ఈ సందర్భంగా వినోద్‌ కుమార్‌ తెలిపారు. ఇక్కడి రైతులు బ్యాంబు సాగుకు మొగ్గు చూపుతున్నారని కొంకన్‌ ప్రతినిధులకు చెప్పారు.