మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్శిటీ వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరింపు - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, December 16, 2019

మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్శిటీ వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరింపు

పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ దేశ రాజధానిలో జామియా మిల్లియ ఇస్లామియా విశ్వవిద్యాలయం విద్యార్థులు చేపట్టిన నిరసన ప్రదర్శనల ప్రభావం.. హైదరాబాద్ పైనా పడింది. జామియా విశ్వవిద్యాలయం విద్యార్థుల తరహాలోనే హైదరాబాద్ లోని మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ యూనిర్శిటీ విద్యార్థులు ఆందోళనలకు దిగారు. నిరసన ప్రదర్శనలకు తెర తీశారు.రాత్రంతా రోడ్ల మీదే బైఠాయించారు. సెమిస్టర్ పరీక్షలను బహిష్కరించారు.వారి ఆందోళనకు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్ సీయు) విద్యార్థులు మద్దతు ఇచ్చారు. దీనితో గచ్చీబౌలిక పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచార అందుకున్న వెంటనే సైబరాబాద్ పోలీసులు రంగప్రవేశం చేశారు. మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్శిటీ వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరింపజేశారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.
పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించడంతో పాటు ఇదే ఉద్యమంలో పాల్గొంటోన్న జామియా మిల్లియా ఇస్లామియా విద్యార్థులను ఢిల్లీ పోలీసులు అక్రమంగా నిర్బంధించడాన్ని నిరసిస్తూ మౌలానా ఆజాద్ ఉర్దూ వర్శిటీ విద్యార్థులు ఈ ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. జామియా యూనివర్శిటీ క్యాంపస్ లోకి ప్రవేశించిన పోలీసులు.. విద్యార్థుల హాస్టళ్లలోకి దూరి మరీ వారిపై లాఠీ ఛార్జీ చేయడం, అక్రమంగా పోలీస్ స్టేషన్ కు తరలించడాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

Post Top Ad