సీఎం కేసీఆర్‌కు ఆత్మీయ సన్మానసభ : తెలంగాణ గౌడ సంఘం ప్రతినిధులు పిలుపు - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, December 27, 2019

సీఎం కేసీఆర్‌కు ఆత్మీయ సన్మానసభ : తెలంగాణ గౌడ సంఘం ప్రతినిధులు పిలుపు

హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్డులోని జలవిహార్‌లో సీఎం కేసీఆర్‌, ఐటీ మంత్రి కేటీఆర్‌కు వచ్చేనెల నాలుగున నిర్వహించే ఆత్మీయ సన్మానసభను విజయవంతంచేయాలని తెలంగాణ గౌడ సంఘం ప్రతినిధులు పిలుపునిచ్చారు. గౌడకులస్థులు పెద్దసంఖ్యలో హాజరుకావాలని కోరారు. గురువారం హైదరా బాద్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను వారు కలిశా రు. ఈ సందర్భంగా ఆత్మీయసభ వాల్‌పోస్టర్‌ను మంత్రి ఆవిష్కరించారు. కార్యక్రమంలో గౌడ హాస్టల్‌ అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్‌రావుగౌడ్‌, కూన వెంకటేశ్‌గౌడ్‌, రవీందర్‌గౌడ్‌, కృష్ణమూర్తిగౌడ్‌, చక్రవర్తిగౌడ్‌, రాజేశ్వర్‌గౌడ్‌, గోపాల్‌గౌడ్‌, శ్రీరామ్‌గౌడ్‌, యాదగిరిగౌడ్‌ పాల్గొన్నారు.



( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )