జనవరి ఒకటి నుండి ఆపరేషన్ స్మైల్ ప్రారంభం : తెలంగాణ పోలీస్ - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, December 31, 2019

జనవరి ఒకటి నుండి ఆపరేషన్ స్మైల్ ప్రారంభం : తెలంగాణ పోలీస్

రాష్ట్రంలో తప్పిపోయిన చిన్నారులు, బాలికల వివరాలను సేకరించి వారి ఫొటోలతో ఆల్బమ్‌ను రూపొందిస్తారు. ఈ వివరాలతో ప్రత్యేక టీమ్‌లు రాష్ట్రంలోని అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, జనసమ్మర్థం ఉన్న జంక్షన్లు, చౌరస్తాలను తనిఖీ చేస్తాయి. దీనికిగాను ప్రతీ సబ్‌ డివిజన్‌లో ఒక ఎస్‌ఐ, నలుగురు పోలీస్‌ కానిస్టేబుళ్లు కలిగిన ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశారు. ప్రతీ టీమ్‌లో ఒక మహిళా సిబ్బంది కూడా ఉంటారు. వెట్టి చాకిరిలో మగ్గిపోతున్న చిట్టి చేతులను కాపాడాలని, వారి ముఖంలో చిరునవ్వును తిరిగితేవాలన్న సంకల్పంతో చేపడుతోన్న ఆపరేషన్‌ స్మైల్‌ సత్ఫలితాలను ఇస్తోంది. ఏటా జనవరి 1 నుంచి 31 వరకు ఆపరేషన్‌ స్మైల్‌ పేరిట పోలీసులు చేపడుతున్న దాడులు వేలాది మంది చిన్నారులకు విముక్తి కలిగిస్తున్నాయి. ఈసారి దాడుల్లో గుర్తించిన పిల్లల్లో దళిత, గిరిజనులు ఉంటే యజమానులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా పెట్టనున్నారు. 2020 మొత్తం వెట్టిచాకిరి, పిల్లల అక్రమ రవాణాపై నిఘా ఉంచాలని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్ని జిల్లాల పోలీసులకు సూచించారు.