పసుపు బోర్డు ఏర్పాటు కోసం రైతులు పోరుబాట పట్టారు. నిజామాబాద్ లోక్‌సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో పసుపు పండించే రైతు లు బోర్డు ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో పోరాటాన్ని ఉద్ధృతం చేయాలని నిర్ణయించారు. గత లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి బరిలోకి దిగిన జగిత్యాల జిల్లాకు చెందిన స్వతంత్ర అభ్యర్థులు, రైతులు జగిత్యాలలో సోమవారం సమావేశమయ్యారు. బోర్డు ఏర్పాటు విషయంలో హామీ ఇచ్చి తర్వాత మొహం చాటేసిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను అడుగడుగునా అడ్డుకోవాలని నిర్ణయించారు. కాగా, పసుపు బోర్డు ఏర్పాటు కోసం మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత కృషి చేశారని, పలుమార్లు కేంద్ర మంత్రులను కలవడంతోపాటు పసుపు సాగు చేసే ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులను సైతం కలిసిన కవిత.. ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి సైతం తీసుకువెళ్లారని గుర్తుచేసుకొన్నారు. ఐదేండ్ల వ్యవధిలో కవిత ఎంతగా ప్రయత్నించినా, కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డు ఏర్పాటు, గిట్టుబాటు ధర కల్పన అంశాన్ని పట్టించుకోలేదని విమర్శించారు.
Post Top Ad
Tuesday, December 24, 2019
పసుపు బోర్డు ఏర్పాటు కోసం నిజామాబాద్ రైతులు పోరుబాట
Admin Details
Subha Telangana News