భారత రైల్వేశాఖ ఆదాయం పెంచుకోవడానికి పలు మార్గాల అన్వేషణ - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, December 17, 2019

భారత రైల్వేశాఖ ఆదాయం పెంచుకోవడానికి పలు మార్గాల అన్వేషణ

భారత రైల్వేశాఖ ఆదాయం పెంచుకోవడానికి పలు మార్గాలను అన్వేషిస్తోంది. కొత్త ఆలోచలను వెల్లడించారు. వీటిలో వారం మొత్తం 24గంటలు తెరిచి ఉంచే దుకాణాలు, పెట్రోల్‌ పంపుల ఏర్పాటు వంటి ఆలోచనలను వెల్లడించారు. ఇటీవల రైల్వేలు ఛార్జీయేతర రంగాల నుంచి ఆదాయం ఏ విధంగా పెంచుకోవాలనే అంశంపై ప్రధాని పలు మార్గదర్శకాలను పంపించారు. ఈ నేపథ్యంలో పరివర్తన్‌ సంఘోస్తి పేరిట ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అధికారుల నుంచి వచ్చిన పలు ఆలోచనల్లో ఆచరించదగిన వాటితో రైల్వే శాఖ ఒక జాబితాను తయారు చేసింది. వీటిని అమలు చేయడానికి సన్నాహలు చేస్తోంది.రైల్వే భూమి నుంచి ఆదాయం పొందే ఏర్పాట్లు చేయడం, అదనంగా ఉన్న 4,000 డీజిల్‌ లోకోమోటివ్‌ ఇంజిన్లను తుక్కు కింద విక్రయించకుండా ఎగుమతి చేయడం వంటి ఆలోచనలు వీటిల్లో ఉన్నాయి. ఈ ఏడాది అక్టోబర్‌ నాటికి రైల్వేల ఆదాయం దాదాపు రూ.19,000 కోట్లు పడిపోయింది. వాస్తవానికి ఏడునెల్లో రూ.1.18లక్షల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. కానీ, రూ.99,222.72 కోట్లు మాత్రమే ఆదాయం లభించింది. \డివిజన్లలో యూనియన్ల ఆఫీసుల సంఖ్యను కూడా తగ్గించాలనే ప్రతిపాదన వచ్చింది. ప్రతి డివిజన్‌లో వివిధ యూనియన్లకు కలిపి 250 మంది వరకు ఆఫీస్‌ బేరర్లు ఉంటారు. దేశవ్యాప్తంగా వీరి సంఖ్య 50,000 వరకు ఉంటుంది. వీరికి ప్రత్యేక మినహాయింపులు ఉంటాయి. దీంతో వీరి నుంచి రైల్వేకు ఆదాయం లభించే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో డివిజన్లలో యూనియన్‌  ఆఫీస్‌ల సంఖ్యను తగ్గించాలని సూచన కూడా వచ్చింది

Post Top Ad