సిద్దిపేట : సిద్దిపేట ప్రభుత్వ బాలికల పాఠశాలలో సత్యసాయి ట్రస్ట్ సహకారంతో టిఫిన్ - ట్యూషన్, వొడా ఫోన్ సహకారంతో... విద్యార్థులకు ఎనీమియా పరీక్షల కార్యక్రమాలను ఆర్థిక శాఖా మంత్రి హరీష్ రావు ప్రారంభించారు.ప్రభుత్వ పాఠశాలల్లో ఆరవ తరగతి నుంచి పదవ తరగతి చదువుతున్న విద్యార్ధులకు 'సాయంత్రం టిఫిన్ - ట్యూషన్' కార్యక్రమమిదని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. ఇక పదవ తరగతి ఫలితాల్లో సిద్దిపేట రాష్ట్పంలో నెంబర్ వన్ స్థానంలో ఉండాలని ఆకాంక్షించారు. ఇక దిశాపై జరిగిన అఘాయిత్యం చాలా బాధ కలిగించిందని హరీష్‌రావు పేర్కొన్నారు. తల్లి తండ్రుల వైఖరిలో మార్పు రావాలని కోరారు. బాలురకు సంస్కారంతో కూడిన విద్య అందించాలని సూచించారు.తల్లిదండ్రులు ఆడపిల్లలపై కన్నా మగ పిల్లలపైనే ఎక్కువ దృష్టి పెట్టాలని, వారికి సంస్కారం, విలువలు నేర్పాలని పిలుపునిచ్చారు.మగ పిల్లలు ఏం చేస్తున్నారన్న విషయంపై నిరంతరం పర్యవేక్షించాల్సిన అవసరముందన్నారు.
మొత్తం రూ. 30 లక్షల వ్యయంతో 413 స్కూల్స్‌లోని 68 వేల మంది విద్యార్థులకు అనీమియా టెస్ట్‌లు నిర్వహించారు. పదకొండు మిషన్లు వొడాఫోన్ సంస్థ అందించింది. కాగా... అనీమియా ఉన్న విద్యార్ధులను గుర్తించి వారికి ఉచిత మందులు , చికిత్స అందజేయటం జరుగనుంది.