పెట్రోలు స్టేషన్‌లో పెట్రోలుకు బదులు బళ్లలో నీళ్లు నింపుతున్న యాజమాన్యం - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, December 27, 2019

పెట్రోలు స్టేషన్‌లో పెట్రోలుకు బదులు బళ్లలో నీళ్లు నింపుతున్న యాజమాన్యం


నిజామాబాద్‌ జిల్లా ఇందల్వాయి మండలంలో విచిత్రం చోటు చేసుకుంది. గన్నారం గ్రామం దగ్గర్లోని ఓ పెట్రోలు స్టేషన్‌లో పెట్రోలుకు బదులు బళ్లలో నీళ్లు నింపడం కలకలం రేపుతోంది. బంకులోని మిషన్లలో నుంచి పెట్రోలుకు బదులుగా నీరే వచ్చినట్లుగా తెలుస్తోంది. గమనించని సిబ్బంది.. వాహనదారులకు యథాతథంగా ఇంధనం నింపడంతో దాదాపు 50 వాహనాలు నిలిచిపోయాయి.స్థానిక శ్రీ చక్ర ఫ్యుయల్ ఫిల్లింగ్‌ స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. కొంత దూరం వెళ్లాక తమ వాహనాలు ఆగిపోడటంతో బాధితులు బంకు వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు. ఈ విషయంపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఎస్సై శివ ప్రసాద్‌ కానిస్టేబుళ్లతో బంకు వద్దకు చేరుకొని యంత్రాల్లోంచి వస్తున్న పెట్రోలును పరిశీలించారు. నీళ్ల సీసాలో నమూనాలను సేకరించి దర్యాప్తు కోసం పంపుతామని ఎస్సై తెలిపారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని బాధితులకు ఎస్‌ఐ హామీ ఇచ్చారు.( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )