తాళాలు వేసిన ఇళ్లలో లక్షల్లో దొంగతనాలు చేస్తున్న మైనర్ యువకులను పట్టుకున్న పోలీసులు - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, December 23, 2019

తాళాలు వేసిన ఇళ్లలో లక్షల్లో దొంగతనాలు చేస్తున్న మైనర్ యువకులను పట్టుకున్న పోలీసులు

జగద్గిరిగుట్ట  లో  ఇద్దరు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకొని వారి నుంచి రూ. 5.69 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. శనివారం బాలానగర్‌ ఏసీపీ పురుషోత్తమ్‌ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడి. గద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఇటీవల నాలుగు ఇళ్లలో చోరీలు చేశారు. సీసీ కెమెరాలు తదితర ఆధారాలతో కేసులను విచారించి ఈ ఇద్దరిని గుర్తించారు. దీంతో వారిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ. 4.80 వేలు విలువ చేసే బంగారం, రూ. 84 వేల విలువ చేసే రెండు కేజీల వెండితో పాటు రూ. 5వేలు స్వాధీనం చేసుకున్నారు.

వివిరాలలోకి వెళ్తే 
శనివారం బాలానగర్‌ ఏసీపీ పురుషోత్తమ్‌ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సూరారం కాలనీ దయానంద్‌నగర్‌ కాలనీకి చెందిన ఇద్దరు మైనర్లు 917,14) తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్‌ చేసి దొంగతనాలు చేస్తుంటారు.ఇద్దరు మైనర్లు 2018 నుంచి దొంగతనాలకు పాల్పడడంతో వివిధ పోలీస్‌ స్టేషన్‌లలో కేసులు నమోదు అయ్యాయి. వీరిలో ఒకరిపై (17) బాలానగర్‌ పీఎస్‌లో రెండు, శామీర్‌పేట పీఎస్‌లో ఒకటి, జీడిమెట్ల పీఎస్‌లో ఒకటి, పేట్‌ బషీరాబాద్‌ పీఎస్‌లో రెండు, జగద్గిరిగుట్ట పీఎస్‌లో రెండు చొప్పున మొత్తం 8 దొంగతనం కేసులు ఉన్నాయి. మరొకరి(14)పై జగద్గిరిగుట్ట పీఎస్‌లో రెండు దొంగతనం కేసులు నమోదు అయ్యాయి.