సంక్రాతి ప్రత్యేక రైళ్లకు పెరగనున్న రైల్వే చార్జీలు - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, December 26, 2019

సంక్రాతి ప్రత్యేక రైళ్లకు పెరగనున్న రైల్వే చార్జీలు

ప్రత్యేక రైళ్లలో సాధారణ చార్జీలను అమాంతంగా పెంచేసినప్పటికీ రైళ్ల నిర్వహణ మాత్రం దారుణంగా ఉంటుంది. ప్రత్యేక రైళ్ల నిర్వహణపై అధికారులు ఏ మాత్రం శ్రద్ధ చూపడం లేదని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి రోజు హైదరాబాద్, సికింద్రాబాద్‌ నుంచి వివిధ ప్రాంతాలకు 10 నుంచి 20 ప్రత్యేక రైళ్లు బయలుదేరుతాయి. ఇవి నిర్ణీత సమయం ప్రకారమే ఇక్కడి నుంచి బయలుదేరినప్పటికీ గమ్యానికి చేరుకోవడంలో మాత్రం తీవ్ర జాప్యం చోటుచేసుకుంటుంది. రెగ్యులర్‌ రైళ్లకు ఉండే ప్రాధాన్యత ప్రత్యేక రైళ్లకు ఉండడం లేదు. దీంతో ఒక్కో రైలు5 గంటల నుంచి 8 గంటలు ఆలస్యంగా  గమ్యస్థానానికి చేరుకుంటుంది. ‘ఒక్కోసారి అంతకంటే ఎక్కువ సమయం కూడా పట్టవచ్చు. రెగ్యులర్‌ రైళ్లు వెళితే తప్ప ప్రత్యేక రైళ్లకు అనుమతి లభించదు. దీంతో తరచుగా ఆగుతూ, సాగుతూ వెళ్తాయి.’ అని రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ‘ప్రత్యేక రైళ్లన్నింటి నెంబర్లు ‘సున్నా’తో మొదవులుతాయి. ఇలా ‘సున్నా’తో మొదలయ్యే రైళ్లనగానే  ఒక నిర్లక్ష్యం ఉంటుంది. దీంతో బాగా ఆలస్యంగా నడుస్తాయని’అన్నారు.
సికింద్రాబాద్‌ నుంచి  విజయవాడకు  వెళ్లేందుకు  స్లీపర్‌ క్లాస్‌ చార్జీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో  కేవలం రూ.220 ఉంటుంది. ఆర్టీసీ బస్సులో ఇది  రూ.450 వరకు ఉంటే  ప్రైవేట్‌ బస్సుల్లో ఇంకా ఎక్కువే ఉంటుంది. నలుగురు కుటుంబసభ్యులు ట్రైన్‌లో అయితే  కేవలం రూ.880 చార్జీలతో  హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వెళ్లిపోవచ్చు. కానీ ప్రస్తుతం ప్రత్యేక రైళ్లలో స్లీపర్‌ క్లాస్‌ చార్జీ రూ.385 వరకు ఉంది. నలుగురు కుటుంబ సభ్యులు కలిసి వెళ్లేందుకు  రూ.1540 వరకు చార్జీల రూపంలో చెల్లించాల్సిందే. ఇక ఏసీల్లో ఈ చార్జీలు ఇంకా ఎక్కువే ఉంటాయి. తక్కువ చార్జీలతో దూర ప్రయాణం చేయవచ్చుననుకొనే  ప్రయాణికులకు ప్రత్యేక  రైళ్లలో  అదనపు చార్జీలు భారంగానే మారాయి. సికింద్రాబాద్‌ నుంచి విజయవాడ వరకు థర్డ్‌ ఏసీ రూ.600 వరకు ఉంటే ప్రత్యేక రైళ్లలో ఇది రూ.1085 వరకు పెరిగింది. అన్ని మార్గాల్లోనూ  ఇదే పరిస్థితి.