వినియోదారుల కొంప ముంచిన అధికారుల అలసత్వం - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, December 26, 2019

వినియోదారుల కొంప ముంచిన అధికారుల అలసత్వం

చింతల్ డివిజన్‌ పరిధిలోని వివిధ సెక్షన్‌లలో అధికారులు ఇష్టారాజ్యంగా ఫీజుబులిటీలు ఇచ్చినట్లు వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు.  అక్రమ నీటి కనెక్షన్లను సక్రమంగా చేసుకునేందుకు జలమండలి (వాలంటరీ డిస్పోజల్‌ స్కీమ్‌) ప్రవేశపెట్టిన వీడీఎస్‌ పథకం నెల రోజులు కావస్తున్నా కుత్బుల్లాపూర్‌ వాటర్‌ వర్క్స్‌ డివిజన్‌ పరిధిలో ఆచరణకు నోచుకోవడం లేదు. దీంతో వినియోగదారులు వాటర్‌ వర్క్స్‌ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమ కనెక్షన్లను గతంలో సంవత్సరం పాటు నీటి బిల్లుల వేసి వీడీఎస్‌కు బదిలీ చేసేవారు. కానీ ప్రస్తుతం ఎటువంటి రుసుము చెల్లించకుండానే కనెక్షన్లను మార్పు చేసేందుకు వీలు కల్పిస్తున్నా ఏ ఒక్క కనెక్షన్‌ ఇంత వరకు వీడీఎస్‌కు బదిలీ కాలేదు. ఈ నేపథ్యంలో ఈ పథకం అసలు అమలు అవుతుందా.. లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. 600 గజాలు దాటిన వాటికి బిల్డింగ్‌లకు పోర్షన్ల వారీగా నమోదు చేయాల్సి ఉండగా 100 నుంచి 200 వందల గజాలకు సైతం పోర్షన్లు యాడ్‌ చేశారు. రూ.650 రావాల్సిన నీటి బిల్లుకు పోర్షన్లు యాడ్‌ చేయడంతో రూ.3,600కు పైగా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అధికారులు ఇష్టారాజ్యంగా కొన్ని భవనాలకు పోర్షన్ల వారీగా నమోదు చేయడంతో వినియోగదారులు డివిజన్‌ కార్యాలయానికి క్యూ కట్టారు. ఈ విషయమై సీరియస్‌గా తీసుకున్న జీఎం శ్రీధర్‌రెడ్డి వాటిని సాధారణ కనెక్షన్లుగా మార్చాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.