దిశ ఘటన: హత్యకేసులో నిందితుల కస్టడీ పిటిషన్‌పై షాద్‌నగర్‌ కోర్టు విచారణ - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, December 02, 2019

దిశ ఘటన: హత్యకేసులో నిందితుల కస్టడీ పిటిషన్‌పై షాద్‌నగర్‌ కోర్టు విచారణ

షాద్‌నగర్‌: దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన దిశ అత్యాచారం, హత్యకేసులో నిందితుల కస్టడీ పిటిషన్‌పై షాద్‌నగర్‌ కోర్టు విచారణ చేపట్టనుంది. నిందితులను పది రోజుల పాటు కస్టడీకి అప్పగించాల్సిందిగా పోలీసులు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం విచారణ జరుగనున్న నేపథ్యంలో పోలీసులు షాద్‌నగర్‌ కోర్టుకు చేరుకున్నారు. ఇదిలా ఉండగా... కోర్టు వద్ద న్యాయవాదులంతా దిశకు మద్దతు తెలిపారు. షాద్‌నగర్, మహబూబ్‌నగర్‌లో ఏ న్యాయవాది కూడా నిందితులకు న్యాయ సహాయం చేయకూడదని తీర్మానం చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా జస్టిస్ ఫర్ దిశకు ప్రతి ఒక్క న్యాయవాది మద్దతు ఇవ్వాలని బార్ అసోసియేషన్ ప్రతినిధులు విఙ్ఞప్తి చేశారు. అదే విధంగా నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.