గాంధీభవన్ వద్ద టెన్షన్ వాతావరణం : తిరంగ ర్యాలీ దృష్ట్యా పోలీసులు బందోబస్తు - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, December 28, 2019

గాంధీభవన్ వద్ద టెన్షన్ వాతావరణం : తిరంగ ర్యాలీ దృష్ట్యా పోలీసులు బందోబస్తు


గాంధీభవన్ వద్ద టెన్షన్ వాతావరణ నెలకొంది. పోలీసుల తీరుపై రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ‘తిరంగ ర్యాలీ’ చేపట్టేందుకు నాయకులు ప్రయత్నిస్తుండగా, వారిని అడ్డుకొని గాంధీభవన్ బయట పెద్ద సంఖ్యలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ర్యాలీకి ప్రభుత్వం అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సేవ్ నేషన్-సేవ్ కాన్‌స్టిట్యూషన్ పేరుతో ర్యాలీ చేయాలని నిర్ణయించారు. గాంధీభవన్ నుంచి లోయర్ ట్యాంక్ బండ్ వరకూ ర్యాలీ చేయాలని తలపెట్టారు. మరోవైపు ట్యాంక్ బండ్ వద్ద కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.