జమ్ముకశ్మీర్లో శ్రీనగర్ భూకంపం సంభవించింది . రెండు గంటల వ్యవధిలో 4.7 నుంచి 5.5 తీవ్రతతో నాలుగుసార్లు భూమి కంపించింది. మరియు అండమాన్ నికోబార్ ద్వీప సమూహంలోనూ 10.29కి స్వల్ప భూకంపం సంభవించిందని తెలిపింది. ఈ విషయాన్ని నేషనల్ సిస్మోలజీ సెంటర్ తెలిపింది. 4.7 తీవ్రతతో వచ్చిన భూకంపం గత రాత్రి 10.42కు వచ్చిందని, తరువాత ఆరు నిముషాల వ్యవధిలో 5.5 తీవ్రతతో మరోసారి భూమి కంపించిందని, అలాగే రాత్రి 10.58కి 4.6 తీవ్రతతో మూడోసారి భూకంపం వచ్చిందని పేర్కొంది. అలాగే తిరిగి మరోమారు 11.20కి నాల్గవసారి 5.4 తీవ్రతతో భూకంపం సంభవించిందని పేర్కొంది. అయితే ఈ భూకంపాల కారణంగా ఎటువంటి నష్టం జరగలేదని పేర్కొంది.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )