ఆదిలాబాద్ లో దారుణం ఛార్జింగ్ పెడుతూ షాక్ గురై మృతి చెందిన యువకుడు - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, December 27, 2019

ఆదిలాబాద్ లో దారుణం ఛార్జింగ్ పెడుతూ షాక్ గురై మృతి చెందిన యువకుడు

సెల్‌చార్జింగ్‌ పెడుతూ విద్యుత్‌షాక్‌ తగిలి ఓ యువకుడు మృతిచెందిన ఘటన ఆదిలాబాద్‌ జిల్లా గుడిహత్నూర్‌ మండలంలోని ఉమ్రి(బి)గ్రామంలో చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన పెందూర్‌ మంతు కుమారుడైన పరమేశ్వర్‌(17) బుధవరాం రాత్రి 8.30 గంటలకు ఇంట్లో మొబైల్‌ఫోన్‌కు చార్జింగ్‌ పెడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్‌షాక్‌కు గురయ్యాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే రిమ్స్‌కు తరలించారు. పరిస్థితి విషమించి మృతిచెందాడు. పరమేశ్వర్‌ ఇచ్చోడలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ రెండోసంవత్సరం చదువుతున్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు గుడిహత్నూర్‌ ఎస్సై కొక్కెల రోహిణి తెలిపారు.